Thursday, May 2, 2024

17న అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్రపతి భవన్‌లో వేడుకలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాం.. ఈ సారి కూడా జరుపుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదు. మజ్లిస్‌కు భయపడే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించలేదన్నారు. నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేంది. బిజెపి గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుందన్నారు.

ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడించారు. 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ రాష్ట్రంలో 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం అన్నారు. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు. తెలంగాణ గడ్డపై 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారి చేతుల మీదుగా గతేడాది హైదరాబాద్‌లో ఉత్సవాలు జరిగాయి. మళ్లీ పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బిఅర్‌ఎస్ ప్రయత్నం చేస్తున్నయని తెలిపారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసారని అన్నారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఆ పార్టీలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రపతిభవన్‌లో..
రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. కేంద్ర ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వానం పంపిస్తామన్నారు. సిఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని ఆయన కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News