జనగాం: స్నేహం పేరుతో నమ్మించి ఓ యువతిపై పది మంది సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జనగామ జిల్లాకు చెంది మోహమ్మద్ ఒవైసి, ముత్యాల పవన్ కుమార్, బౌద్ధుల శివ కుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎమ్.డి. అబ్దుల్ ఖయూం, పుస్తకాల సాయి తేజ, ముట్టాడి సుమంత్ రెడ్డి, గుండ సాయి చరణ్ రెడ్డి, ఒరుగంటి సాయి రామ్ అనే యువకులు ఓ యువతితో పరిచయం పెంచుకున్నారు.
స్నేహం పేరుతో యువతిని జనగా-సూర్యాపేట రోడ్డులోని టీ వరల్డ్ లో ఓ రూమ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆ యువతిపై పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులలో ఒకడు యువతిని గోవాకు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బాధితురాలి అత్తకు తెలియడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పది మంది నిందితులను సిద్దిపేట రోడ్డులో పట్టుకున్నారు. సిఐ దామోదర్ రెడ్డి, ఎస్‌ఐ భరత్ వారిని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.