Friday, April 19, 2024

ఆ రెండు జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. కొమురం భీమ్ జిల్లాలో 11.1, ఆదిలాబాద్‌లో 12.2 , మంచిర్యాల 13.3, నిర్మల్ 14, సిద్దిపేట 13.4, సంగారెడ్డి 13.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. తెలంగాణలో క్రమంగా చలితీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు గజ గజ వణికి పోతున్నారు. శీతకాలం ప్రవేశంతోనే చలి సైతం విజృభింస్తుండడంతో పౌరులు హడలి పోతున్నారు. నవంబర్ రెండో వారంలో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. గత రెండు రోజుల నుంచి మళ్లీ చలి తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. చలి పెరగడంతో పిల్లలు, పెద్ద వయసు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News