Thursday, September 18, 2025

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. బయటకు వస్తే మాడిపోతారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వనపర్తి జిల్లా కేతేపల్లిలో 40.6, పెబ్బేరులో 40.5 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరలో 40.1 డిగ్రీలు, గద్వాల జిల్లా ఆలంపూర్ లో 40, నిజామాబాద్ లో 40 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు సూచించారు. గత రెండు వారాలుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎండదంచి కొడుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News