Saturday, April 13, 2024

కశ్మీరులో రోడ్డు ప్రమాదం..10 మంది వలస కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్-జమ్మూ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఒక పాసింజర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాంబాన్ జిల్లాలోని బ్యాటరీ చెష్మ అనే ప్రదేశం వద్ద 300 అడుగుల లోతున ఉన్న లోయలో వాహనం పడిపోయిందని వారు చెప్పారు. మృతులు వలస కార్మికులని, వారంతా శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. లోయలో నుంచి మృతదేహాల వెలికతీను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News