Saturday, July 27, 2024

పోలీస్ శాఖలో కలవరం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం పోలీసు శాఖలో డిజి స్థాయి నుంచి ఎస్‌ఐల వరకూ పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసు శాఖలో కలవరం మొదలైందని చెబుతున్నారు. తమ పోస్టు ఉంటుందా? ఊడుతుందా? అని పెద్ద సంఖ్యలో పోలీసు అధికారుల్లో బహిరంగ చర్చ కొనసాగుతుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు, ఎన్నికల కోడ్ రాక మునుపే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున పోలీసు బదిలీలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో పైరవీలు సైతం పెద్ద ఎత్తున నడిచాయనే ఆరోప ణలు లేకపోలేదు. ఇక ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల పోలీసు అధికా రులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇందుకు ముషీరాబాద్‌లో సిఐ, ఎసిపి, డిసిపిలపై ఇసి సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇక డిజిపి అంజనీకుమార్ సైతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన నేప థ్యంలో ఆయన సస్పెన్షన్‌కు గురైన సంగతి విదితమే.

దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక భారీ స్థాయిలో అధికారుల మార్పులు, చేర్పులు తధ్య మనే వాదన వినవస్తోంది. ఇటీవల ఇద్దరు రిటైర్డ్ పోలీసు ఉన్నతా ధికారులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రవ్యాప్తంగా సిపి లు, జిల్లా ఎస్పీలుగా పనిచేసే వారికి సైతం పదవీ గండం తప్పకపో వచ్చన వాదన లేకపోలేదు. ప్రధానంగా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మా ర్పు అనివార్యంగా ఉండవచ్చనే వాదన ప్రముఖంగా వినవస్తోంది. ఇంకో వైపు హైదరాబాద్ సిపి సివి ఆనంద్‌ను తప్పించి ఆ స్థానంలో సందీప్ శాండిల్యాను ఇసి నియామించిన సంగతి విదితమే. అయితే, ట్రై కమిషనరేట్ల పరిధిలో సిపిల మార్పుకు కొత్త ప్రభుత్వం తెరదీసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ప్రధానంగా నగర పరిధిలో పనిచేసే ఎసిపి, డిసిపిలకు సైతం స్థాన చలనం కలిగే అవకాశం మెండుగా ఉందని చెబుతున్నారు. మరోవైపు జిల్లాల వారీగా పోలీసు శాఖలో పనిచేసే ఎస్‌ఐల పనితీరుపైనా నూతన ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల ముందు భారీగా మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

డిజిపి రేసులో జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్, రవిగుప్తా
ఇదిలా ఉండగా రాష్ట్ర డిజిపి మార్పు సైతం అనివార్యమని తెలుస్తోంది. డిజిపి రేసులో పలువురు ఐపిఎస్‌ల పేర్లు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంచార్జ్ డిజిపిగా రవి గుప్తా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త డిజిపి నియామకాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుతం డిజిపి రేసులో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికొకరికి డిజిపి పదవి కట్ట బెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కూడా మార్చే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News