Wednesday, October 9, 2024

పాక్‌లో సెక్యూరిటీ చెక్‌పోస్టుపై ఉగ్ర దాడి.. ఆరుగురు జవాన్ల మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని సంక్షుభిత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో శుక్రవారం తెల్లవారుజామున ఒక సెక్యూరిటీ చెక్ పోస్టుపై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌కు సరిహద్దున ఉన్న ఈ ప్రావిన్సులో భద్రతా చెక్ పోస్టుపై దాడి జరిపింది తామేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్(టిటిపి) ప్రకటించింది. దక్షిణ వజ్రిస్తాన్ జిల్లాలోని మిస్టా గ్రామంలో ఉన్న సెక్యూరిటీ చెక్ పోస్టు ఉగ్రవాదుల దండు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News