Friday, May 2, 2025

అమృత్‌సర్‌లో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

దేశ సరిహద్దుల్లోని అత్యంత కీలక మత క్షేత్రం అమృత్‌సర్‌లో భారీ స్థాయి ఉగ్ర కుట్ర భగ్నం అయింది. పహల్గాం ఉగ్రదాడుల తరువాత భారీ స్థాయి బందోబస్తు , తనిఖీల దశలో అమృత్‌సర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు , మందుగుండు సామాగ్రిని పోలీసు బలగాలు స్వాధీనపర్చుకున్నాయి. ఉగ్రవాదులు అత్యంత వ్యూహాత్మకంగా ఇక్కడ దాడులకు వ్యూహం పన్ని ఉంటారని వెల్లడైంది. దీనితో ఇక్కడ బందోబస్తు , నిఘా తనిఖీలను ముమ్మరం చేశారు. బిఎస్‌ఎఫ్ .పంజాబ్ పోలీసు బృందాలు అమృత్‌సర్ శివార్లలోని భరోపాల్ వద్ద ఈ ఆయుధాల గిడ్డంగిని గుర్తించారని అధికారులు తెలిపారు. ఈ ఆయుధాల ష్వాధీనం ఎప్పుడు జరిగిందనేది వెల్లడికాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News