Friday, September 13, 2024

హైదరాబాద్ ‘ఉగ్ర’ కుట్రపై రంగంలోకి ఎన్‌ఐఎ..!?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ‘ఉగ్ర’ కుట్రపై ఎన్‌ఐఎ విచారణ జరపనుంది. ఈ ఉగ్ర కుట్ర ఘటనలో 17 మంది హెచ్‌యుటి అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసింది హిజ్బ్ ఉత్ తహరీక్ (హెచ్‌యుటి). దీంతో గత నెలలో హెచ్‌యూటీ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో హెచ్‌యుటి సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డార్క్ వెబ్ సైట్ , రాకెట్ చాట్, తీమ్రా యాప్‌లతో నిందితులు చాటింగ్ నిర్వహించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

Also Read: కోరమండల్ నేపథ్యంలో కాగ్ నిజాలు

అరెస్టైన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మరో ఆరుగురు హైద్రాబాద్ కు చెందినవారు. హైద్రాబాద్ లో ఉగ్ర మూకలు మూడు దశల్లో తమ ప్లాన్ ను అమలు చేసేలా వ్యూహారచన చేశాయి. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ చానెల్ కు 3600 మంది సబ్ స్క్రైబర్లున్నారు. వీరంతా ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడులకు పాల్పడేందుకు గాను అనంతగిరి అడవుల్లో నిందితులు శిక్షణ పొందారని కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పేలుడు పదార్దాల తయారీ, తుపాకీ పేల్చడం వంటి వాటిపై నిందితులు శిక్షణ పొందారని సమాచారం. వీటన్నింటిపైనా ఎన్‌ఐఎ సమగ్ర విచారణ జరిపే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News