Saturday, October 5, 2024

‘ప్రత్యేక అధికారాల’తో సమస్య జటిలం

- Advertisement -
- Advertisement -

అధికార రాజకీయాలు ఈశాన్యంలో, కశ్మీర్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదం కొనసాగేందుకు దోహదం చేశాయి. ఎన్నికల్లో అక్రమాలకు తీవ్రవా దులతో లాలూచీ పడడం, రాజకీయ ప్రత్యర్థులను బెదరించడం మన దేశంలో ఎక్కువగా అనుసరించే రాజకీయ ఎత్తుగడలు. గత పార్లమెంటరీ ఎన్నికల్లో తీవ్రవాదులు ఇంఫాల్ లోయలో తుపాకులతో ఓటర్లను బెదిరిస్తూ అనేక పోలింగ్ కేంద్రాలను ఆక్రమించడం అందుకు ఒక ఉదాహరణ. అయితే, భారీగా ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో వారు విఫల మయ్యారు. 1975లో అప్పటి ఎన్‌ఎన్‌సితో చరిత్రాత్మక షిల్లాంగ్ ఒప్పందం నుంచి 1997లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం) వర్గం (ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం)తో కాల్పుల విరమణ ఒప్పందం వరకు, అటుపిమ్మట 2015లో (ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం)తో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం వరకు దేనిలోను అంశాలను ఇప్పటికీ గోప్యంగా ఉంచారు.

మిలిటరీ మార్గంలో తిరుగుబాటుపై పోరు విజయవంతం కాలేదు. ఈశాన్య ప్రాంతంలో, కశ్మీర్‌లో, పంజాబ్‌లో మనకు దాని అనుభవం తగినంత ఉంది. మన సైనికాధికారులు, వరుస ప్రభుత్వాలు సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. వారు సాధారణంగా దేశంలో తీవ్రవాదానికి మిలిటరీ పరిష్కారంపై ఆధారపడుతుంటారు. తీవ్రవాదులను సంప్రదింపుల వేదికకు తీసుకురావడంలో బలప్రయోగం పాత్ర కాదనలేనిది. అయితే, తిరుగుబాటు సమస్య పరిష్కారంలో సామాజిక చర్చ ప్రధాన బలంగా ఉంటున్నది. అధికారంలో ఉన్నవారు మన దేశంలో తీవ్రవాదంపై పోరులో బలప్రయోగం, సామాజిక చర్చ మధ్య సమతూకం పాటించడంలో దారుణంగా విఫలమయ్యారు. మన దేశంలో పలు చట్టాలు చేయడం ద్వారా సైన్యానికి, పోలీసులకు, భద్రత బలగాలకు స్వేచ్ఛ ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘనను, అమాయకుల ఇక్కట్లను పెంచింది. అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (మీసా) 1971, భారత రక్షణ చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ), అటువంటి కొన్ని చట్టాలను అంతర్గత వివాదాల కట్టడికి చేయడమైంది. అటువంటి చట్టాలు చేసిన చరిత్ర అధికార దుర్వినియోగం తప్ప మరేమీ కాదు. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం (అఫ్‌స్పా) మన దేశంలో చట్టం దుర్వినియోగం చరిత్రకు ఒక సుదీర్ఘ అధ్యాయంగా చేరింది.

అధికార రాజకీయాలు ఈశాన్యంలో, కశ్మీర్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో తీవ్రవాదం కొనసాగేందుకు దోహదం చేశాయి. ఎన్నికల్లో అక్రమాలకు తీవ్రవాదులతో లాలూచీ పడడం, రాజకీయ ప్రత్యర్థులను బెదరించడం మన దేశంలో ఎక్కువగా అనుసరించే రాజకీయ ఎత్తుగడలు. గత పార్లమెంటరీ ఎన్నికల్లో తీవ్రవాదులు ఇంఫాల్ లోయలో తుపాకులతో ఓటర్లను బెదిరిస్తూ అనేక పోలింగ్ కేంద్రాలను ఆక్రమించడం అందుకు ఒక ఉదాహరణ. అయితే, భారీగా ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో వారు విఫలమయ్యారు. 1975లో అప్పటి ఎన్‌ఎన్‌సితో చరిత్రాత్మక షిల్లాంగ్ ఒప్పందం నుంచి 1997లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం) వర్గం (ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం)తో కాల్పుల విరమణ ఒప్పందం వరకు, అటుపిమ్మట 2015లో (ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం)తో మోడీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం వరకు దేనిలోను అంశాలను ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. అదంతా విభిన్న రాజకీయ ప్రయోజనాలను సూచిస్తున్నది.

అఫ్‌స్పా చరిత్ర

వివాదాస్పద సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం, 1958కి మూలం 1942 నాటి వలసవాద చట్టం సాయుధ దళాల ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్. క్విట్ ఇండియా ఉద్యమం అణచివేతకు బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1942 ఆగస్టు 15న ఆ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. స్వాతంత్య్రానంతరం అస్సాం ప్రభుత్వం నాగా తిరుగుబాటును అణచివేయడానికి 1953లో నాగా పర్వత ప్రాంతాల్లో అస్సాం శాంతి భద్రతల నిర్వహణ (స్వతంత్ర ప్రతిపత్తి జిల్లా) చట్టాన్ని విధించి, తిరుగుబాటుదారులపై పోలీస్ చర్యను ఉద్ధృతం చేసింది. పరిస్థితి విషమించినప్పుడు అస్సాం నాగా పర్వత ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించి, 1955 నాటి అస్సాం కల్లోలిత ప్రాంతాల చట్టం చేసింది. దీనితో ఆ ప్రాంతంలో తిరుగుబాటు అణచివేతకు పారా మిలిటరీ బలగాలకు, సాయుధ రాష్ట్ర పోలీస్ (ఎఎస్‌పి) దళానికి చట్టపరమైన పరిధి సమకూరింది.

అయితే, అస్సాం రైఫిల్స్, రాష్ట్ర సాయుధ పోలీసులు నాగా తిరుగుబాటును కట్టడి చేయలేకపోయారు. తిరుగుబాటు వర్గమైన నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ (ఎన్‌ఎన్‌సి) 1956 మార్చి 23న ‘నాగాలాండ్ ఫెడరల్ ప్రభుత్వం’ పేరిట పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాయుధ దళాల (అస్సాం, మణిపూర్) ప్రత్యేక అధికారాల ఆర్డినెన్స్ 1958ని రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1958 మే 22న జారీ చేశారు. దాని స్థానంలో 1958 సెప్టెంబర్ 11న సాయుధ దళాల (అస్సాం, మణిపూర్) ప్రత్యేక అధికారాల చట్టం చేయడమైంది. ఈ చట్టం స్థానంలో ‘సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం, 1958’ వచ్చింది. దానిని సంక్షిప్తంగా అఫ్‌స్పా 1958గా పేర్కొన్నారు. ఆ చట్టాన్ని క్రమంగా ఈశాన్యంలో ఇతర రాష్ట్రాల్లో అమలు జరిపారు. 1983లో ఆ చట్టాన్ని పంజాబ్, చండీగఢ్‌లకు వర్తింప చేశారు. కానీ, అది అమలులోకి వచ్చిన సుమారు 14 సంవత్సరాల తరువాత 1997లో దానిని ఉపసంహరించారు. 1990లో దానిని జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేశారు.

అది అప్పటి నుంచి అమలులో ఉన్నది. అఫ్‌స్పా క్రీనీడలో సాయుధ బలగాలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, చిత్రహింస, అత్యాచారాలు, హత్యలు, బోగస్ ఎన్‌కౌంటర్లు సాగిస్తున్నట్లు, ప్రాసిక్యూషన్ అరుదు అని సంవత్సరాల అనుభవం చాటింది. ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, నాగాలాండ్ అఫ్‌స్పా వ్యవస్థ వల్ల ఎక్కువ ప్రభావితమైంది. ఆ రాష్ట్రంలో గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి. అస్సాంలో కూడా అత్యాచారాలు, మానవహక్కుల ఉల్లంఘన ఘటనలు అనేకం సంభవించాయి. ఆ చట్టానికి వ్యతిరేకంగా 2004 లో సాగిన ఉద్యమానికి రాష్ట్రం వెలుపల కూడా సంఘీభావం సూచనలు కానవచ్చాయి. అయితే, నాగాలాండ్‌లో మోన్ జిల్లా ఒటింగ్‌లో 2021 నాటి పౌరుల హత్యల సంఘటన ఆ చట్టం రద్దు కోసం ఈశాన్యంలో ప్రజలు బాహాటంగా కోరడానికి దారి తీసింది.

అఫ్‌స్పా, మణిపూర్

మణిపూర్‌లో ప్రస్తుతం జాతులు మధ్య సాగుతున్న సంఘర్షణలను అవకాశంగా తీసుకుని అక్కడి తిరుగుబాటు వర్గాలు అన్నీ ఇప్పుడు రాష్ట్రంలో మరింత క్రియాశీలకంగా మారాయి. మణిపూరి మైతై ఆధిపత్య జాతి వర్గంగా ఉన్న లోయలో మైతై అజ్ఞాత వర్గాలు ఇప్పుడు చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న తమ సొంత మైతై ప్రజలకే అజ్ఞాత సంస్థలు బలవంతపు డబ్బు వసూలుకు నోటీసులు జారీ చేస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో కుకీ తీవ్రవాద వర్గాలు కూడా అదే స్థాయిలో క్రియాశీలకంగా ఉన్నాయి. మైతై తీవ్రవాద వర్గాలు ప్రభుత్వ ప్రాపకం పొందుతుండగా, కుకీ తీవ్రవాద వర్గాలు అంతర్జాతీయ సరిహద్దు ఆవలి నుంచి మద్దతు పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుకీ, నాగా తెగలు నివసించే మణిపూర్ పర్వత ప్రాంత జిల్లాల్లో అఫ్‌స్పాను ప్రభుత్వం విధించింది. అయితే, దానిని లోయ ప్రాంతాల్లో ఉపసంహరించడమైంది. ఆ చట్టాన్ని పర్వత ప్రాంత గిరిజన జనాభాపై వివక్షపూరిత చర్యగా కుకీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మైతై తీవ్రవాద వర్గం అరంబై తెంగోల్ 2024 జనవరి 24న ఇంఫాల్ కంగ్లా కోటలో తమ డిమాండ్లకు తలొగ్గేలా రాష్ట్ర శాసన సభ్యులను ఒత్తిడి చేసిన తరువాత, ఇతర మైతై తీవ్రవాద వర్గాలు లోయలో బాహాటంగా కార్యకలాపాలు సాగిస్తున్న తరువాత కూడా లోయ ప్రాంతాల నుంచి అఫ్‌స్పాను ఉపసంహరించడాన్ని కుకీ సంస్థలు నిరసించాయి. ఇంఫాల్ లోయలో లూటీ చేసిన 6000 పైగా ఆయుధాలు ఇప్పటికీ మైతై తీవ్రవాదుల చేతుల్లో ఉన్నందున, అఫ్‌స్పాను లోయ ప్రాంతాల్లో అమలు చేయాలన్నది సుస్పష్టం అవుతోందని కుకీ వర్గాలు వాదిస్తున్నాయి. లోయ ప్రాంతాల్లో మైతై తీవ్రవాద వర్గాలకు వేర్పాటువాద డిమాండ్ల చరిత్ర ఉన్నది. ఆ వివాదాన్ని పరిష్కరించే యత్నంగా కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ మణిపూర్‌లో కుకీ జో తిరుగుబాటు వర్గాలకు వర్తించే నిబంధనలను సమీక్షిస్తున్నది. ఆ వర్గాలు 2008 నుంచి ప్రభుత్వంతో ‘సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (ఎస్‌ఒఒ) ఒప్పందం పరిధిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యల్లో ఒకటి మైతై ప్రజలు ఆధిపత్యం గల లోయ జిల్లాలకు సమీపంలోని ప్రదేశాల నుంచి ఎస్‌ఒఒ శిబిరాలను తొలగించడం. ఆ శిబిరాలను పర్వత ప్రాంతాల లోపల తిరిగి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఇంఫాల్ లోయ ప్రధాన కేంద్రంగా గల నిషిద్ధ తెగ మైతై సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్)తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2023 నవంబర్ 29న ఒక ‘శాంతి ఒప్పందం’ కుదుర్చుకున్నాయి.

ఆ త్రైపాక్షిక ఒప్పందాన్ని ‘చరిత్రాత్మక విజయం’ గా శ్లాఘించారు. ఎందుకంటే మణిపూర్ మైతై తెగా మెజారిటీకి చెందిన తీవ్రవాద వర్గం భారత ప్రభుత్వం ఒక ఒప్పందంపై మొదటి సారిగా సంతకం చేసింది. ఆ ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా మణిపూర్‌లో ‘నూతన శాంతి శకం తీసుకు వస్తుంది’ అని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొన్నది. అటువంటి ఒప్పందంపై సంతకాల మాట అలా ఉంచితే కల్లోలిత మణిపూర్‌లో శాంతి ఇంకా దూరంగానే ఉన్నది. 2023 మే 3న రాష్ట్రంలో ఆదివాసీ కుకీ జో, మైతై ప్రజల మధ్య హింసాత్మక సంఘటనలు మొదలైనప్పటి నుంచి 237 మందికి పైగా హతులయ్యారు.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News