Thursday, July 10, 2025

బస్ పాస్ ధరలను భారీగా పెంచిన ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి సంస్థ షాకిచ్చింది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. ఈ మేరకు బస్ పాస్ లపై ఆర్టీసి ప్రకటన చేసింది. ఇకనుంచి ఆర్టీసి బస్ పాస్ ధరలను 20 శాతం పెంచుతూ టిజీఎస్ఆర్టీసి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800 కు పెంచింది. పెరిగిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి రానున్నట్టు ఆర్టీసి యజమాన్యం తెలిపింది. అయితే, బస్ పాస్ ధరలను పెంచడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News