Sunday, July 6, 2025

థాక్రే సోదరుల ఐక్య గర్జన

- Advertisement -
- Advertisement -

20ఏళ్ల తరువాత ఒకే వేదికపై ఉద్ధవ్,
రాజ్ థాక్రేల ద్వయం మహారాష్ట్ర ప్రభుత్వం
త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఒక్కటైన
అన్నదమ్ములు ఫడ్నవీస్ ప్రభుత్వానికి
ఘాటైన హెచ్చరికలు తెలుగు,తమిళులు
మాతృభాషలపై చూపే ప్రేమ గర్వంగా
అనిపిస్తోందని ప్రశంసలు

ముంబై : విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే లు దాదాపు 20 ఏల్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. మ హారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో ఇది ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ శనివారం ముంబై వేదికగా ‘వాయిస్ ఆఫ్ మరాఠీ ’ కార్యక్రమం నిర్వహిస్తు న్నారు. ఇందులో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రేలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారనుంది. ఈ కార్యక్రమంలో రాజ్ థాక్రే మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆంగ్ల మాధ్యమంలో చదువు కోవడం ద్వారా మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకొనే అవకాశం లేకుండా పోతోందని మోడీ ప్రభు త్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండి పడ్డారు. దక్షిణ భారత దేశంలో ఎందరో సినీనటులు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళం వంటి భాషల విషయంలో ఎంతో గర్వంగా ఉంటారన్నారు. అలాగే మహారాష్ట్ర నేతలకు, ప్రజలకు కూడా త మ భాషపై అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తమకు హిం దీ భాషపై వ్యతిరేకత ఎప్పుడూ లేదని రాజ్ అన్నారు. అయితే ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News