Saturday, July 27, 2024

ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!

- Advertisement -
- Advertisement -

Thackeray faction calls EC order on symbol

ముంబై : శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా స్తంభింప చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3 న జరిగే తూర్పు అంధేరీ ఉప ఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని వాదులాడుకొంటుండటంతో ఈసీ ఎవరికీ గుర్తు కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తమకు “శివసేన బాలా సాహెబ్ థాక్రే ” లేదా “శివసేన ఉద్ధవ్ బాబా సాహెబ్ థాక్రే” పేర్లలో ఏదోఒక దాన్ని పార్టీకి కేటాయించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం , లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే , త్రిశూలం గుర్తు అని, అవి కుదరక పోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుకుంటోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు బాణం గుర్తు ఈసీ శనివారం తాత్కాలికంగా స్తంభింప చేసింది. వచ్చే ఉప ఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యం లోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News