Tuesday, September 17, 2024

బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ ‘తంగలాన్’

- Advertisement -
- Advertisement -

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ‘తంగలాన్‘ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ‘తంగలాన్‘ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. విజయవాడలో ‘తంగలాన్‘ చిత్ర ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ “ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్‌తో రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక కొత్త వరల్డ్‌లోకి మిమ్మల్ని ‘తంగలాన్’ సినిమా తీసుకెళ్తుంది”అని అన్నారు. హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ “తంగలాన్‌లో ఆరతి అనే క్యారెక్టర్ చేశాను. నా కెరీర్‌లో చేసిన ది బెస్ట్ రోల్ ఇది. ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు. నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ “తంగలాన్ సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్, ట్రైలర్ కొంత మాత్రమే. సినిమాలో చాలా మైమరపించే కంటెంట్ ఉంది. ఛియాన్ విక్రమ్ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్‌లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత అంకితభావంతో విక్రమ్ నటించారు”అని తెలిపారు. ఈ సమావేశంలో హాలీవుడ్ నటుడు డేనియల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News