Tuesday, May 7, 2024

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -
- Advertisement -

ఇళ్ల నిర్మాణానికీ మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్‌లను సిద్ధం చేయాలి
గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష
నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధి, విధానాలు ఖరారు చేస్తారని రెవెన్యూ, హౌసింగ్, సమాచారా పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాస రాజు, గృహ నిర్మాణ సంస్థ ఎండి శ్రీమతి విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికీ మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ ను పునరుద్ధరణ చేస్తూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడానికి అవసరమైన సిబ్బందితో పాటు అధికారులను ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోనే విధంగా ప్రతిపాదనలు సిద్ధ చేయాలని సంబంధిత సెక్రటరీని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమానికి అవసరం అయిన నిధుల సమీకరణ కొరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల వివరాలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆస్తుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇందిరమ్మ హౌసింగ్ కోసం ఉపయోగిస్తామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News