Tuesday, October 15, 2024

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’… ఓ సూపర్ మూవీ!

- Advertisement -
- Advertisement -

దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు విజయ్ తో తీసిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా సూపర్ గా ఉంది.  సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సినిమా అంటే ఇలా ఉండాలనే విధంగా ఉంది. విజయ్, రాజీవ్ మీనన్, ప్రభు దేవ, ప్రశాంత్, మోహన్,అజ్మల్, జయరామ్ ల ఓ రహస్య గూఢచారి మిషన్ టీమ్ పని మొదలెట్టడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. పరిస్థితులు చాలా వేగవంతంగా మారిపోతుంటాయి. ప్రధాన పాత్రలో నటి స్నేహ పాత్ర కొంత మేరకే సపోర్టివ్ గా ఉంటుంది. ఆమె తన టాలెంట్ ను ప్రదర్శించే స్కోప్ ఈ సినిమాలో తక్కువ. హాస్య నటుడు యోగి బాబు కూడా కాసేపు అలరిస్తాడు.  మీనాక్షి చౌదరి, ప్రముఖ నటి త్రిషా ఉన్నప్పటికీ వారి పాత్రలు కాసేపే. నటీమణుల పాత్రలు ఈ సినిమాలో పెద్దగా మెరువలేదనే చెప్పాలి. సినిమాలో కామెడీ లేదు. పైగా త్రిష, విజయ్ పాట కూడా మామూలుగానే ఉంది.

Vijay and Trisha

ఈ సినిమాలో విజయ్ ది ద్విపాత్రాభినయం. ఈ సినిమా కథ వివరిస్తే సస్పెన్స్ పోతుంది. కానీ ఇదో ప్రతీకార కథకు సంబంధించిన సినిమా. కనుక చెప్పడం లేదు. అది చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ముగింపు వరకు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నటుడు విజయ్ ఇదివరకటి చిత్రాలకు ఈ చిత్రం చాలా భిన్నమనే చెప్పాలి. ఈ సినిమా థియేటర్లలో బాగానే ఆడుతోంది. థ్రిల్లర్, యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

Vijay 2

రేటింగ్: 3.5/5

రివ్యూ: అశోక్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News