Tuesday, March 5, 2024

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు వెలవెలబోతున్నాయి

- Advertisement -
- Advertisement -

* స్థిమితం లేని నాయకుడు వెంకటరెడ్డి
* కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి
నల్లగొండ: పీపుల్స్ మార్చ్‌లో ప్రజలు లేక వెలవెలబోతున్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, గమ్యం లేని గమనం లేని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అభివృద్ధిలో వారి పాత్ర ఏమాత్రం లేదని విమర్శించారు.

బట్టి విక్రమార్క, ఉత్తమ్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలు వెలవెలబోతున్నాయని అన్నారు. శనివారం రాత్రి నల్లగొండలో నిర్వహించిన బట్టి సభకు కేవలం 150 మంది వచ్చారని, వారిలో వంద మంది కోలాట బృందం, ఆయ నతోపాటు వచ్చిన సభ్యులేనన్నారు. సభకు ప్రజల ఆదరణ కరువైందని, కాంగ్రెస్ చెప్పేవి పచ్చి అబద్దాలన్నారు.కాంగ్రెస్‌లో సీట్ల కోసం కోట్లా టలు, పోటీ పాదయాత్రలు తప్ప కాంగ్రెస్ వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. స్థిమితం లేని నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అన్నారు. అధికార కాంక్షతోనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సం వత్సరాలలో రెండు సంవత్సరాలు కోవిడ్‌తో గడిచిపోగా, మిగిలిన ఏడు సంవత్సరాల కాలంలో 7 వేల కోట్లు ఇరిగేషన్‌కు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. జడ్చర్ల నుండి కోదాడ వరకు జాతీయ రహదారి రోడ్డు ప నులను మంజూరు చేయించానన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల, బత్తాయి మార్కెట్, నిమ్మ మార్కెట్, రెండు కేంద్రీయ విద్యాలయాలు, మిషన్ భగీరధ రెసిడెన్సియల్ స్కూల్స్ మంజూరు చేశారన్నారు.

తెలంగాణ ప్రాంతం అంతటా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డిసిసిబి డైరెక్టరు శ్రీనివాస్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News