Wednesday, September 27, 2023

తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ నాయకత్వంలో తొమ్మిది ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించి వందేండ్ల అభివృద్ధి సాధించామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. తెలంగాణచ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో హఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని సత్యభారతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకన్న, సుధాంష్, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్‌గౌడ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస రావు, రోజాదేవి రంగరావు, విద్యుత్ అధికారులు డీఈ గోపాలకృష్ణలతో కలిసి ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ నిత్య కోతల నుండి నిరంతరం వెలుగుల ప్రస్థానం, నాటి పాలకుల హయాంలో కరెంట్ కోతలు, పవర్ హలిడేలతో జనం అష్టకష్టాలు పడ్డారని, నేడు నిరంతరం విద్యుత్‌తో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించందని అన్నారు. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమ లతో సహ అన్ని రంగాలకు నిరందరం 24గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, నిరంతరం విద్యుత్ సరఫరాతో భారతదేశ ధ్యానాగారంగా తెలంగాణ చరిత్ర సృష్టించందని అన్నారు. 20 రోజుల పాటు ఊరురా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత కార్మికులకు, హెచ్‌ఐవి బాధితులకు ఆసరా పింఛన్లు, కళ్యాణలక్షి/షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహఁం, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, అమ్మఒడి, హాస్టల్ విద్యార్థులకు సన్నరకం బియ్యం, గురుకుల పాఠశాలల ద్వారా అల్పసంఖ్యల వర్గాలకు ఉచిత విద్య, మైనారిటీ రెసిడెంటిల్ స్కూల్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్, అల్పసంఖ్యల వర్గాలకు ఉపకార వేతనాలు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తూ బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, ఏరియా మెంబర్లు, కమిటీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులుయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News