Saturday, October 5, 2024

రూ. 2 కోట్ల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

- Advertisement -
- Advertisement -

ఘట్కేసర్: పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. మక్త గ్రామంలోని నాగభూషణం ఇంట్లో రూ. 2 కోట్లకు పైగా నగదును దుండగులు దోచేశారు. ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉంచిన నోట్ల కట్టలను ఎత్తుకెళ్లారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరకుని విచారణ చేపట్టారు.

నాగభూషణం ఇటీవల శంకర్ పల్లిలో 10 ఎకరాల భూమి అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొనుగోలుదారులు అడ్వాన్సుగా ఇచ్చిన రూ. 2 కోట్ల 2 లక్షల నగదును ఇంట్లో ఉంచగా, దొంగలు దోచేశారు. నగదుతోపాటు 28 తులాల బంగారు నగలను కూడా దోచుకెళ్లారు. అనుమానంతో నాగభూషణం డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News