Tuesday, May 6, 2025

ఈసారి పరిస్థితులు ఊహించిన విధంగా లేవు: వెట్టోరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఏడాది ఫైనల్ వరకూ చేరి రన్నర్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది చతికలపడిపోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కి గెలిచే అవకాశాలు ఉన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. దీనిపై జట్టు ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరి స్పందించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది తమకు కాస్త భిన్నంగా ఉందని ఆయన అన్నారు.

‘ప్రతి మ్యాచ్‌ దూకుడుగా ఆడాలని అనుకోలేదని. కానీ, ఈ సంవత్సరం పరిస్థితులు ఊహించిన విధంగా లేవు. హైదరాబాద్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. రెండు పిచ్‌లు 250+ స్కోర్ చేసేలా ఉంటే.. నాలుగు పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కి అనుకూలించాయి. అదే సమయంలో స్పిన్నర్లకు సహకరించలేదు,. కొత్త బంతిని కొట్టడం కొట్టడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. బంతి బ్యాట్‌ మీదకు రాలేదు’’ అని వెటోరి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News