Tuesday, April 30, 2024

ఈ ఎన్నికలు.. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరటం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న యుద్ధం.. ఈ ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలో బుధవారం వయనాడులో రోడ్ షో నిర్వహించిన రాహుల్ గాంధీ.. అనంతరం కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ ఎన్నికలు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరటం. ఓ వైపు ఈ దేశంలో ప్రాజస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు.. మరోవైపు, ప్రజాస్వామ్య స్వభావాన్ని, రాజ్యంగాన్ని కాపాడాలనుకునే శక్తి ఉంది. ఎవరు ఏ వైపు ఉన్నారో మీరందరికీ తెలుసు. ఎవరు రాజ్యాంగంపై, ప్రజాస్యామ్యంపై దాడికి పాల్పడుతున్నారో స్పష్టం. ఈ పోరాటంలో మాకు అండగా ఉండాలి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News