మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్‌గిరి డిటిఎఫ్ సిబ్బంది ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 31గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, బైక్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ఎపిలోని రాజమండ్రికి చెందిన డానియల్ రాజు, అభిరామ్, అభిషేక్ వర్మ కలిసి మల్కాజ్‌గిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నారాపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ముగ్గురు బెంగళూరులో ఉంటున్న నైజీరియాకు చెందిన వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ముగ్గురు నిందితులు తరచూ బెంగళూరుకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ డిటిఎఫ్ సిఐ భరత్ భూషణ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది కలిసి దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ అనంతరెడ్డి,గణేష్ లాల్, వికాస్ రెడ్డి, తదితరులు పట్టుకున్న వారిలో ఉన్నారు.