Monday, July 22, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, చైతన్యపురి, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాములు హెరాయిన్, 2గ్రాములు ఎండిఎంఏ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…రాజస్థాన్ రాష్ట్రం, గుడమలాని, బార్మర్‌కు చెందిన విర్మా రామ్ డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్నాడు. ఇతడికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ కళ్యాణ్ అలియాస్ దినేష్‌కుమార్ అలియాస్ రాహుల్ బాయ్ అలియాస్ దినేష్ బిష్ణోయ్, హీరా రామ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారిని రామ్ వీరి వద్ద కొనుగోలు చేసి తీసుకునేవాడు. తర్వాత వారి వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో నిఘా పెట్టిన ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, చైతన్యపురి పోలీసులు మెట్రో స్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు.

వనస్థలిపురంలో…
ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2గ్రాములు ఎండిఎంఏ, రెండు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సిద్దిపేట జిల్లా, జగదేవ్‌పూర్, ధర్మారానికి చెందిన జెర్రు ఆకాష్, మోగిలి వెంకటేష్ ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, నగరంలోని నేరెడ్‌మెట్‌కు చెందిన శ్రీకాంత్ వీరికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు, పరారీలో ఉన్నాడు. ఆకాష్, మోగిలి వెంకటేష్ ఇద్దరు స్నేహితులు కర్కపట్లలోని ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు డ్రగ్స్‌కు బానిసలుగా మారారు, తర్వాత డ్రగ్స్ కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. ఇలా సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. నేరెడ్‌మెట్‌కు చెందిన శ్రీకాంత్ వద్ద ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలో అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. వీరు డ్రగ్స్‌ను వనస్థలిపురంలో విక్రయించేందుకు రాగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News