Saturday, December 2, 2023

ముగ్గురు ఘరానా దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం పట్టణంలో ముగ్గురు ఘరనా దొంగలను మంగళవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు తులాల బంగారు ఆభరణాలు, ఒక ఆటోరిక్షాతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణంతో పాటు, చుట్టుప్రక్కల మణుగూరు, సారపాక, ఖమ్మం పట్టణాలలో దేవాలయాలు, ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్న మాలోతు విక్రమ్, బండారి సాయితేజ, సురిపాక నాగరాజులను పక్కా సమాచారం మేరకు సీసీ కెమెరాల సహాయంతో భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితులను విచారించగా వారు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. వీరు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు దొంగతానాల్లో పట్టుబడి జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదల అయినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దొంగలను చాకచక్యంగా అరెస్ట్ చేసిన భద్రాచలం పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ సీఐ నాగరాజురెడ్డి, ఎస్‌ఐలు శ్రీకాంత్, మధుప్రసాద్, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News