Thursday, July 3, 2025

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ఇటీవల ప్రకటించినప్పటికీ వారి కోసం భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా శనివారం ఉదయం ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా అభయారణ్యం దట్టమైన అడవుల్లో నక్సలైట్లు నక్కి ఉన్నారనే నిఘా వర్గాల పక్కా సమాచారం మేరకు డిఆర్‌జి బీజాపూర్, డిఆర్‌జి దంతవాడ, ఎస్‌టిఎఫ్, కోబ్రా బెటాలియన్లు 210, 202 సంయుక్త బృందాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఒక్కసారిగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్‌పి జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇంకా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉందని, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News