Saturday, September 14, 2024

బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మున్సిపల్ వైస్ చైర్మన్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Three Members arrested in Rape case

 

మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి : సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ము గ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు నిర్మ ల్ డిఎస్‌పి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించామన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌తోపాటు అతని కారు డ్రైవర్ జాఫర్, మధ్యవర్తి అన్నపూర్ణలను రిమాండ్‌కు తరలించినట్టు ఆయన చెప్పారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 26వ తేదీన బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు సం బంధించిన వివరాలు చెబుతూ.. స్థానిక వైఎస్సార్ నగర్‌లో నివాసం ఉండే అన్నపూర్ణతో వైస్ చైర్మన్ సాజిద్‌కు పరిచయం ఉండేది. అన్నపూర్ణ ఇంటిపక్కన ఉండే బాధితురాలైన మైనర్ బాలికపై కన్నేసిన సాజిద్ ఆమెను తన వద్దకు పంపించాలని.. దానికి బదులు డబుల్ బెడ్‌రూం ఇళ్లు బహుమతి గా ఇస్తానని ఆశ చూపించాడు. దీంతో అన్నపూర్ణ బాధితురాలిని నిజామాబాద్‌లో శుభకార్యం ఉంద ని మాయమాటలు చెప్పి నిజామాబాద్‌కి కాకుం డా మున్సిపల్ వైస్ చైర్మన్ కారులో హైదరాబాదు కు తీసుకెళ్లింది. అప్పటికే హైదరాబాద్‌లోని లాడ్జి లో రూం తీసుకున్న సాజిద్ బాధితురాలిపై అత్యాచారానికి పూనుకున్నాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాడని బాధితురాలిని అన్నపూర్ణ బెదిరించింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో.. ఆమె బాధితురాలిని తీసుకుని చైల్డ్ వెల్ఫేర్, సఖి సెంటర్‌ను సంప్రదించారు. దీంతో అధారాలన్ని సేకరించి కేసు నమో దు చేశామని డిఎస్‌పి చెప్పారు. కాగా, నిందితుడు సాజిద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై గతంలోనూ పలు కేసులున్నాయని,రౌడీషీట్ తెరిచామని డిఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News