ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాల మధ్య జరిగిన మ్యాచ్‌లో డిఎల్‌ఎస్ పద్ధతిలో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి కారణం ఆ మూడు ఓవర్లే. అందులో ఒకటి హార్థిక్ వేసిన ఎనిమిదవ ఓవర్ కాగా. ఆ తర్వాత విల్ జాక్స్ వేసిన 13వ ఓవర్ ఇవి రెండు మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాయి.
18వ ఓవర్ పూర్తయిన తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం ఒక ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సిందిగా.. గుజరాత్‌కు లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ ఓవర్‌ని దీపక్ చాహర్‌కి ఇచ్చాడు కెప్టెన్ హార్థిక్ పాండ్యా.. ఈ ఓవర్‌లో తొలి బంతికే ఫోర్, ఆ తర్వాత సింగిల్, ఆ తర్వాత సిక్సును బాదారు బ్యాట్స్‌మెన్. నాలుగో బంతికి నోబాల్‌పై సింగిల్ రాగా.. ఫ్రీహిట్ బంతికి కూడా సింగ్‌లే వచ్చింది. ఐదో బంతికి కోయిట్జీని దీపక్ ఔట్ చేశాడు. ఆరు బంతికి ఒక పరుగు అవసరం ఉండగా.. అర్షద్ సింగిల్ తీసి గుజరాత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.