Tuesday, October 15, 2024

పాము కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

ఒడిశా లోని బౌధ్ జిల్లా చరియాపలి గ్రామానికి చెందిన శాలేంద్ర మల్లిక్ కుటుంబం లోని ముగ్గురు ఆడపిల్లలు ఆదివారం రాత్రి పాముకాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వీరంతా నేలపై నిద్రించిన సమయంలో పాము కాటు వేసింది. ఆదివారం రాత్రి ఉన్నట్టుండి మల్లిక్, ఆయన ముగ్గురు కుమార్తెలకు ఏదో కుట్టినట్టు నొప్పిగా అనిపించి ఉలిక్కిపడి లేచి చూడగా పాము వెళ్తుండటాన్ని చూశారు.

వెంటనే స్థానికుల సాయంతో శాలేంద్ర మల్లిక్‌ను ఆయన ముగ్గురు కుమార్తెలను ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే చికిత్సపొందుతూ ముగ్గురు చిన్నారులు స్మృతిరేఖ (12). శుభరేఖ (9). సురభి (3) ప్రాణాలు కోల్పోయారు. తండ్రి శాలేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల తల్లి, సోదరుడు ఈ పాము కాటు నుంచి తప్పించుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ పాములు వీరిని కాటేసి ఉంటాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News