Tuesday, September 10, 2024

డివైడర్‌ను ఢీ కొన్న బైక్..ముగ్గురు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన పాతబస్తీ బండ్లగూడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సైదాబాద్ శంకేశ్వర్ బజార్‌కు చెందిన బ్యాగరి శ్రీహరి (28), సందీప్ (20) , అభిలాష్ (20) స్నేహితులు. ముగ్గురు స్నేహితులు సోమవారం సైదాబాద్‌లో బోనాల పండుగ కావడంతో ఎంజాయ్ చేయడానికి పల్సర్ బైక్‌పై బయటికి వెళ్లారు. ఈ క్రమంలోనే అభిలాష్ సోదరి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. దీంతో అభిలాష్‌ను మైలార్‌దేవ్ పల్లిలో ఉండే అతడి సోదరి ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు ముగ్గురు బైక్‌పై వస్తున్నారు.

చాంద్రాయణగుట్ట మీదుగా మైలార్‌దేవ్‌పల్లికి వస్తుండగా హాషమాబాద్ వద్ద స్పీడ్‌గా ఉన్న బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న శ్రీహరి, సందీప్, అభిలాష్‌లు ముగ్గురు బైక్‌పై నుంచి 20మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ముగ్గురి తలకు తీవ్ర గాయాలు కావడంతో సందీప్, అభిలాష్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీహరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదంపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News