Sunday, December 15, 2024

పొలంలో రైతుపై పులి దాడి

- Advertisement -
- Advertisement -

ఆసి ఫాబాద్ కొమురం భీం జిల్లాలో పులి దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. శుక్రవారం లక్ష్మి అనే మహిళా కూ లీపై పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆ సుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈ ఘటన మరువకముందే శనివారం ఉదయం మరో రై తుపై పులి దాడి చేసింది. సిర్పూర్ టౌన్ దుబ్బగూడ వద్ద పత్తి చేనులో పనిచేస్తున్న రౌతు సురేశ్‌పై పులి వెనుక నుం చి దాడి చేసింది. ఆ సమయంలో సురేశ్ గట్టిగా అరవడం తో పక్కనే పంట పొలాల్లో ఉన్న తోటి రైతులు అక్కడికి కే కలు వేస్త్తూ పరుగున రావడంతో పులి అక్కడి నుండి అడవిలోకి పారిపోయింది. గాయపడిన రైతును వెంటనే స్థా నిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మె రుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. వరుసగా పులి ప్రజలు, పశు సంపదపై దాడి చేస్తున్న నేపథ్యం లో అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కాగజ్‌నగర్, సిర్పూర్ తిన్మండలంలో ఆంక్షలు వి ధించారు. ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించా రు. పులి కదలికలపై నిఘా పెట్ట్టేందుకు ఎక్కడికక్కడ బో నులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇస్‌గాం, నజ్రుల్‌నగ ర్, సీతానగర్, అన్కోడ, గన్నారం, కడంబ, ఆరెగూడ, బా బునగర్ గ్రామాల పరిసరాలలో పులి సంచరిస్తోందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ని వసించే ప్రజలు పొలం పనులకు వెళ్లవద్దని హెచ్చరించా రు. గత నాలుగేళ్లలో ఇక్కడ పులుల సంఖ్య అనూహ్యం గా పెరిగిందని వారు అన్నారు. అందుకే ఆయా ప్రాంతా ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. నాలుగేళ్లలో నలుగురిపై పులి దాడి చేయడంతో మృతి చెందారని అన్నారు. పంట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News