కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. సెయింట్ లుయీస్ కింగ్స్ ఓపెనర్. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ (Tim Seifert) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. బార్పుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీగ్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో సెంచరీ చేసిన సీఫర్ట్.. 53 బంతులు ఎదురుకొని 10 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 125 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ చేసిన సెంచరీ లీగ్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ మాత్రమే కాగా.. కరేబియన్ లీగ్‌లో రెండో అత్యధిక స్కోర్ కూడా కావడం విశేషం. 2019లో జరిగిన సీజన్‌లో బ్రాండన్ కింగ్.. గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతూ బార్బడోస్ ట్రైడెంట్స్‌పై అజేయమైన 132 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ ఆమిర్ జాంగూ (56), షకీబ్ అల్ హసన్ (61) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం 205 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లూసియా కింగ్స్ సీఫర్ట్ (Tim Seifert) చెలరేగిపోవడంతో 17.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
Also Read : టి-20ల్లో అతడే నెం.1.. మనోళ్లిదరూ అతడి తర్వాతే: సురేష్ రైనా