Friday, July 19, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. 24 కంపార్టుమెంట్లు ఫుల్

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక, శనివారం శ్రీవారిని 77,995 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 30,250 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కాగా, జులై 18న అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News