Saturday, July 27, 2024

తిరుమల వెంకన్నను దర్శనానికి 15 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక, సోమవారం శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా, ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ ఉండనుంది. రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News