Tuesday, April 30, 2024

10 ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు, 5 కిలోల రేషన్: టిఎంసి మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, డిఎంకె బాటలో టిఎంసి నడుస్తూ, కేంద్రంలో బిజెపిని ఓడించిన పక్షంలో పౌరసత్వ చట్టంలో మార్పులను ఉపసంహరిస్తామని శపథం చేసింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో సీట్ల పంపకం చర్చలు విఫలమైనా ఆ బృందంలోనిదిగా భావిస్తున్న టిఎంసి దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా పది ఎల్‌పిజి సిలిండర్లు, ఐదు కిల్లో ఉచిత రేషన్లు (బియ్యం, గోధుమలు, పప్పులు) సరఫరా చేస్తామని కూడా వాగ్దానం చేసింది. ఎంఎస్‌పి వివాదంలో రైతులకు దన్నుగా ఉంటామని కూడా టిఎంసి ప్రతిన చేసింది.

ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, ‘ఉత్పత్తి సగటు వ్యయం కన్నా కనీసం 50 శాతం అధికంగా’ ఎంఎస్‌పి ధరను నిర్ధారిస్తామని టిఎంసి ప్రకటించింది. పెట్రోల్, డీజెల్ ధరలను ‘భరించగలిగే స్థాయికి పరిమితం చేస్తాం’ అని, భవిష్యత్తులో ధరల్లో మార్పులను తట్టుకునేందుకు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగలమని టిఎంసి హామీ ఇచ్చింది. జాబ్ కార్డ్‌దారులకు 100 రోజుల గ్యారంటీ పని కల్పిస్తామని కూడా టిఎంసి వాగ్దానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News