Sunday, December 15, 2024

శుక్రవారం రాశి ఫలాలు(08-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతనంగా మొదలుపెట్టే పనుల వల్ల శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరం అవుతాయి.

వృషభం – మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి.

మిథునం – ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు సరైనవే అయినప్పటికీ కార్యక్రమాలలో జాప్యం చోటు చేసుకుంటుంది.

సింహం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికందివస్తుంది. చెల్లింపులను కూడా మీరు సకాలంలో చెల్లిస్తారు.

కన్య – ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు.

తుల – వ్యతిరేక వాతావరణం లోను అనుకూల ఫలితాలను సాధిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగాలపరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి.

వృశ్చికం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన విషయాలు గ్రహిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకువ అవసరం.

మకరం – చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన పూర్తి చేస్తారు. ఇంట్లోశుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కుంభం – నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. సహోదరి వర్గమునకు మీ శక్తికి మించి సాయపడాల్సి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు.

మీనం – మీ శక్తి సామర్థ్యాలు మీ కన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు. ఖర్చు అధికంగా ఉన్న సంతానపరమైన పురోభివృద్ధి బాగుంటుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News