Thursday, September 19, 2024

సోమవారం రాశి ఫలాలు(12-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో కంటే సొంత వ్యాపారమే మేలు అనే ధోరణి మీలో ఏర్పడుతుంది. పై అధికారుల మెప్పును పొందగలుగుతారు.

వృషభం – మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు మంచి అభివృద్ధి పథంలో ఉంటాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో మంచి పురోగతి సాధిస్తారు.

మిథునం – ఉద్యోగంలో ఎదుగుదల కోరుకుంటారు. స్థిరచరాస్తుల కొనుగోలుకు యత్నిస్తారు. పెద్ద వాళ్లతో సమాజంలో పరపతి కలిగిన వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.

కర్కాటకం – చాలా సందర్భాలలో నిర్మొహమాటమైన మాటలు చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫిక్స్ డిపాజిట్లు లాభిస్తాయి.

సింహం – కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఏర్పడిందని నిర్ణయించుకుంటారు. కొంతమంది తో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారికి దూరంగా ఉంటారు.

కన్య – స్నేహితులతో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన.

తుల – సహాయం చేసిన వ్యక్తులే తిరిగి మీరు చేసిన సహాయాన్ని నిందించే పరిస్థితి ఏర్పడుతుంది. మనం మంచి చేసిన కూడా మనకు ఓ నింద వచ్చింది అని మీరు మానసికంగా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త వహించండి.

వృశ్చికం – ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. శుభకార్యాలు చేస్తారు. ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విదేశియాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు.

ధనుస్సు – ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయంలో ఉన్నవారికి పదవి లభించే అవకాశం.       వృత్తి – ఉద్యోగాల పరంగా స్థిరత్వం సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు.

మకరం – వారసత్వ హక్కులు లభిస్తాయి దీని వలన లాభ పడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో సత్సంబంధాలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.

కుంభం – వృత్తి ఉద్యోగాలపరంగా నూతన వ్యూహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతానాన్ని అతి గారాబం  చేస్తారు. అది మీకు దీర్ఘకాలంలో కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.

మీనం – క్రమశిక్షణాయుతమైన జీవితంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా అమలు చేస్తారు. ధైర్యం చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు.అది లాభాల్లో నడుస్తుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News