Sunday, September 15, 2024

శుక్రవారం రాశి ఫలాలు(16-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మనం ఊహించే అంశాలు వేరు దైవ సంకల్పం వేరు అని గ్రహిస్తారు. మీరు అనూహ్య స్థాయిలో గొప్పగా భావించిన వ్యక్తులు మీకు సహాయం చేయకపోగా నిరాశ కలిగించడం మీ మనస్థాపానికి కారణం అవుతుంది.

వృషభం – ప్రజా సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహిస్తారు. మొండి బాకీలు వివాదాస్పదంగా మారుతాయి జాగ్రత్త వహించండి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం – ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష వాదనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అన్ని వైపుల నుండి వాస్తవాలు గ్రహించండి ఏం చేయాలో మార్గం మీరే ఎంచుకోండి.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలలో బదిలీ సమస్యగా మారవచ్చు. ఆత్మీయ వర్గానికి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా, విదేశీయానా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉన్నాయి.

సింహం – జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాలలో ప్రభావితం చేస్తుంది. ఇది కీలకమైన అంశంగా భావించండి. సొంత వాళ్ళతో కూడా మాట్లాడడానికి తీరిక లేనటువంటి పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది.

కన్య – సమాజంలో ఓ స్థితి సాధించడానికి పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించెందుకు తగిన అవకాశాలు కలిసి వస్తాయి.

తుల – ఆత్మీయుడని భావించిన వ్యక్తిని నమ్మి మోసపోతారు. కనుక ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్త అవసరం. స్వీయ సంపాదనతో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

వృశ్చికం – విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది ఎలా అయినా పొదుపు చేయాలని దీర్ఘాలోచన చేస్తారు.

నుస్సు – ముఖ్యమైన విషయాలలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. జాగ్రత్త వహించాలి. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. బ్యూటీ పార్లర్ నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది.

కరం – సంతానం వలన బంధువులలో ప్రతిష్ట పెరుగుతుంది. సంతానం యొక్క విద్యా విషయమై ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది.

కుంభం – ఉద్యోగంలో బాధ్యత నిర్వహించే క్రమంలో కొంత మందితో విభేదాలు వస్తాయి. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. అభిప్రాయాలకు విలువ లేని చోట ఉండటం అనవసరమని భావిస్తారు.

మీనం – భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. యోగ మెడిటేషన్ ప్రకృతి వైద్యాల వల్ల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News