Friday, September 20, 2024

శనివారం రాశి ఫలాలు(17-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన గృహం ఏర్పడే అవకాశాలకు గోచరిస్తున్నాయి. నూతన గృహ యోగం నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.

వృషభం – ఆరోగ్య సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలు వాటికవే పూర్తవుతాయి.

మిథునం – కొద్దిపాటి విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాలు చేస్తారు. మెడిసిన్ సీటు కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం – మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చును. మానసికంగా ఆనందాన్ని కలిగి ఉంటారు.

సింహం – వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో చాలా విషయాలు పరిష్కరించుకోగలుగుతారు.

కన్య – కొంతమంది వ్యక్తులను  నమ్మి ధనం పోగొట్టుకునే విధంగా ఉంటుంది. ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే మీ చేతి ద్వారా డబ్బు ఇవ్వకపోవడం మంచిది. చీటీల వల్ల ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి.

తుల – స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. హెయిర్ ఫాల్, కీళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ సలహాలు సూచనలు పాటించడం మంచిది.

వృశ్చికం – స్థిర చరాస్తులకి వచ్చిన నష్టమేమీ లేదు వచ్చిందల్లా మన అనుకున్న వ్యక్తులు మన తోడు లేరనే మానసిక వేదన మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి.

ధనుస్సు – పెట్టిన పెట్టుబడులు ఫిక్స్ డిపాజిట్లు లాభిస్తాయి. స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మధ్యవర్తి పంచనామాలు, మధ్యవర్తిత్వం మీకు ఏమాత్రం కూడా కలిసి రాదు.

మకరం – అందం మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం సహకరించకపోవడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అధిక శ్రమను పంచుకొనుటకు నమ్మకస్తులైన వారిని ఎంచుకొని బాధ్యతలను అప్పగిస్తారు.

కుంభం – ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించండి. ఆర్థికపరమైన సాహసాలు ఫలిస్తాయి. మీకు రావలసిన ధనం చేతికి అందుతుంది.ఉద్యోగంలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత ఉంటుంది.

మీనం – బంధు వర్గం వారిని ఆపదలో ఆదుకోవాల్సిన స్థితి తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రం సందర్శించాలనుకున్న టువంటి మీ కోరిక ముందుకు వెళుతుంది. మానసిక సంత్రుప్తి కలుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News