Sunday, September 15, 2024

సోమవారం రాశి ఫలాలు(19-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మోస్తరుగా ఉంటుంది.స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన ఆచరణలో పెట్టే విధంగా గ్రహగతులు  గోచరిస్తున్నాయి.

వృషభం – కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూల పడే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి.

మిథునం – స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసి  పోతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి లభించే విధంగా అవకాశాలుంటాయి. ఆరోగ్యం నలతగా ఉండును.

కర్కాటకం – తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతులు పూర్తి చేస్తారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు. విడిపోవాలని భావించిన వారితో సఖ్యత కుదురుతుంది.

సింహం – కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం వలన మేలు జరిగే అటువంటి అవకాశం ఉంది. భూమికి సంబంధించిన విషయాలు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలిస్తాయి.

కన్య – ఆదాయానికి మించిన ఖర్చులు అదుపు చేయడంలో విఫలమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయ విషయాలు మీకు చికాకు కలిగిస్తాయి.

తుల – రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు.

వృశ్చికం – మొండి బాకీలు వసూలు చేయగలుగుతారు. మధ్యవర్తి పరిష్కారాలు వల్ల కొద్దిపాటి లాభాలు వస్తాయి. భగవంతుని దయవలన ఒకచోట నష్టపోయిన మరోచోట లాభపడతారు.

ధనుస్సు – సివిల్ క్రిమినల్ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ప్రేమ వివాహం గురించి మీ వాక్యనాలు అభిప్రాయాలు విమర్శలకు దారి తీస్తాయి.

మకరం – మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు సేవా సంస్థలు మంచి అభివృద్ధి పథంలో ఉంటాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణం లోనూ అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు.

కుంభం – వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తను వినగలుగుతారు. ఇది  మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

మీనం – సహోదర సహోదరి వర్గం వారు మీ మీద లేనిపోని ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News