Tuesday, May 7, 2024

శనివారం రాశి ఫలాలు(24-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం -ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి.

వృషభం –ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

మిథునం -కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక.

కర్కాటకం –కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం –పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్రా లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు.

కన్య –వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

తుల –రుణభారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

వృశ్చికం – వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వాహన యోగం.

ధనుస్సు –రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఉద్యోగాలలో ఏర్పడిన ఒడిదుడుకులు తొలుగుతాయి. సోదరుల నుండి ధనలాభం.

మకరం –బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం.

కుంభం –కార్య జయం కలుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూ యోగం.

మీనం –వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.

 

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News