Sunday, December 15, 2024

గురువారం రాశి ఫలాలు(28-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆరోగ్య సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. రుణ వత్తిడులు చికాకులు కలిగిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో మాత్రం నిదానం చాలా అవసరం.

వృషభం – కుటుంబ సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. భూమి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మిథునం – కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి.

కర్కాటకం – వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విషయంలో మెలకువలు అవసరం.  నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది.

సింహం – ప్రచారంలో ఉన్న పుకార్లను ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోరు.  వీసా పాస్పోర్ట్ అంశాలు ఒకింత పురోభివృద్ధిలో ఉంటాయి. వ్యాపారాభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య – బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు.  నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల – నూతన పెట్టుబడులకు తొందరపాటు చేయకూడదు. స్థలాలు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి విఫల యత్నం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

వృశ్చికం – ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు. చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ తుది ఫలితం మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు – దూరప్రాంత ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి. స్నేహితులతో కలిసి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.

మకరం – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది. మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది.

కుంభం – పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలను సానుకూలము చేసుకోవడానికి కృషి చేసి కొంత పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రద్ధ కనబరిచి అనుకూల ఫలితాలు సాధిస్తారు.  పుస్తక పఠనం నందు ఆసక్తి కలిగి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News