Tuesday, December 10, 2024

శుక్రవారం రాశి ఫలాలు(29-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ కింది స్థాయి ఉద్యోగులు మీపై చాడీలు చెప్పడం మీకు తలనొప్పిగా మారుతుంది. స్థిరాస్తి వివాదాలలో  స్తబ్దత నెలకొంటుంది. ఒకానొక శుభకార్యమును ఖరారు చేస్తారు.

వృషభం – సంప్రదింపులు, సంభాషణలు, సందర్శనలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు.

మిథునం – ఆర్థిక లావదేవిలు కొంత అనుకూలంగా సాగుతాయి. ఇంతకాలం పడ్డ శ్రమకు ఫలితం దక్కుతుంది. పరిశోధనలపై దృష్టిని సారిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

కర్కాటకం – ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు. వ్యవహారాలు సానుకూలంగా జరుగుతున్న సమయంలో అతి జాగ్రత్త వల్ల కానీ లేక అహంభావ ధోరణి వల్ల స్వల్పమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం – వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు చోటు చేసుకున్నప్పటికీ అవసరాలకు తగినంత ధనాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి.

కన్య – ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలను సానుకూల పరచుకోగలుగుతారు. మిత్రబంధు వర్గం నుండి వచ్చే చిన్న చిన్న సమస్యలను తెలివిగా సర్దుబాటు చేసుకోగలుగుతారు.

తుల – పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు.

వృశ్చికం – తప్పించుకు తిరగకుండా ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. సహచర వర్గం కరువవుతారు. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది.

ధనుస్సు – నూతన పదవి ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మకరం – దూరపు బంధువులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. సమస్యల నుండి బయటపడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బదిలీల సూచన.

కుంభం – కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు. రాజకీయాలు అమితంగా ఆకర్షిస్తాయి.  సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు అయితే వాటి అమలు విషయంలో ఊగిసలాట చోటు చేసుకుంటుంది.

మీనం – ఎంత మాత్రం సానుకూల పడవవు అనుకున్న పనులను సానుకూల పరుచుకునే యత్నాలు చేస్తారు. పోటీ తత్వాన్ని పెంచుకుంటారు. కుటుంబ సమస్యలను నేర్పుగా చక్కదిద్దుకుంటారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News