Tuesday, May 14, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(05/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం: రుణాలు కొంతవరకు తీరుతాయి. పెట్టబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చేయిగా ఉంటుంది. మీ పరపతి పదింతలు అవుతుంది. ఆనందంలో తేలుతారు.

వృషభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. మీరు మొదలు చేసిన నూతన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మిథునం: స్వల్పంగా ధనలాభం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వివాదాలకు, అనాలోచిత విషయాలకు దూరంగా ఉండుట మంచిది. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు వచ్చినా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నిదానంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం: ఆస్థి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. మానసిక ఉల్లాసంతో పనులు త్వరగతిన పూర్తి చేస్తారు. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహం: జీవిత భాగస్వామి నుండి ఆర్థిక పరంగా లబ్ధి పొందుతారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు అనుకున్న లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ అలంకార సామాగ్రి, వస్తులాభాలు పొందుతారు.

కన్య: సహోదర వర్గంతో ఆర్థికపరమైన లావాదేవీల విషయంపై వివాదాలు ఏర్పడతాయి. మీరు చేసే పనులలో తప్పులు జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి ఆకస్మిక శుభ ఆహ్వాలనాలు అందుకుంటారు.

తుల: ఆర్థిక ఇబ్బందులు చికాకులు పెడతాయి. మనం ఒకటి తలచితే పైవాడు ఒకటి తలుస్తాడు అనే విధంగా ఉంటుంది. కాని చేసే పనులు నిబద్ధతో చేస్తే విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి-వ్యాపారాల పరంగా స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. ఆడంబరాలకు ధనం అధికంగా ఖర్చవుతుంది. ఏ నిర్ణయం చేసినా వెనుకా ముందు ఆలోచించి చేయండి. లేదంటే మొదటికే మోసం అవుతుంది.

ధనస్సు: పెట్టుబడులకు తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలుక కొంతవరకు తీరుస్తారు. ప్రశాంత వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. వాటిని నిలుపుకోవడానికి శత విధాలుగా శ్రమిస్తారు.సాధిస్తారు.

మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మానసిక ధైర్యం విడవవద్దు.చేపట్టిన పనులు మందకొండిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కుంభం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీరు తలపెట్టిన పనులు వేగంగా సాగుతాయి. స్థిరచరాస్థులు కొనుగొలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం . రాజకీయ రంగాల వారు శుభవార్తాలు వింటారు.

మీనం: రాజకీయ, కళారంగం, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల సందర్శనం ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News