Tuesday, July 16, 2024

నేటి రాశి ఫలాలు.. ఫలితాలు…(06/09/2023)

- Advertisement -
- Advertisement -

మేషం: భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ, షేర్ల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. స్వల్ప ధన లాభం. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.స్వల్ప అనారోగ్య సూచన.

వృషభం:సంఘంలో గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది.

కర్కాటకం: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల వారికి స్వల్ప లాభాలు గోచరిస్తాయి. వస్తు లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో గోప్యత చాలా అవసరం.

సింహం: అకస్మిక ధన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు విద్యలో ఏకాగ్రత కనపరుస్తారు. భాగస్వామి వ్యాపారాలలో అభివద్ధి సాధిస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అకస్మిక ధన లాభాలు పొందుతారు.

కన్య: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. బంధువులను, స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన చికాకులు పెట్టినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. రుణ బాధలు తప్పకపోవచ్చు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. క్రమవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృశ్చికం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకొండి. విందు వినోదాలు, శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక వస్తు లాభాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

ధనస్సు: ఉద్యోగస్తులకు స్థాన చలనం గోచరిస్తున్నది. వృత్తి-వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా, సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. రాజకీయ రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.

మకరం: గతంలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతలు, ఇంక్రిమెంట్లు పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఇతరులతో ఆచితూచి మాట్లాడటం మంచిదని చెప్పదగిన సూచన.

కుంభం: మీ సంతానం నూతన కార్యక్రమాలు చేపట్టి నిదానంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి-వ్యాపారాలు లాభిస్తాయి.

మీనం: సోదరుల నుండి ఆస్థి లాభాలుపొందుతారు. బంధువలు నుండి శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహన సౌఖ్యం గోచరిస్తున్నది. ఉద్యోగస్తులకు సానుకూల సమయమని చెప్పవచ్చును.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News