Wednesday, July 24, 2024

శనివారం రాశి ఫలాలు 15-06-2024

- Advertisement -
- Advertisement -

మేషం –ముఖ్యమైన పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.ధనాని కన్నావ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు.

వృషభం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కళా రాజకీయ రంగాలలో వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి.

మిథునం – క్రయక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటకం – ఆధ్యాత్మిక ప్రసంగాలపట్ల ఆకర్షితులు అవుతారు.ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు.నరగోష అధికంగా ఉంటుంది.

సింహం – కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి. మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు

కన్య – రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి చేసే యత్నాలు కలిసి వస్తాయి.స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

తుల – ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. మీ ఈ నిర్ణయంతో ఎవరు ఏకీభవించరు

వృశ్చికం – మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది.ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి.నేర్పుగా అందుపుచ్చుకోండి. కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు – ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగినది. విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు ఉపకరిస్తాయి.

మకరం – వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీకు ఊరట కలిగించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

కుంభం – అవసరాలకు సరిపడదనాన్ని సమకూర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి.

మీనం – విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News