Tuesday, May 7, 2024

ఆదివారం రాశి ఫలాలు(18-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును. వస్తుకొనుగోలు.

వృషభం –బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.రాజకీయరంగాలవారికి కొంత అనుకూలం.

మిథునం –పాత బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కర్కాటకం –కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.

సింహం –అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్య –వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులలో స్థానచలనం. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖుల కలయిక.

తుల –వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి ధన లాభం.

వృశ్చికం –ఊహించని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు.

ధనుస్సు –కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం –రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం

కుంభం –చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం నాకు కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధన, వస్తు లాభం.

మీనం –ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News