Wednesday, May 15, 2024

సోమవారం రాశి ఫలాలు(19-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తుకొనుగోలు.

వృషభం –ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహన సౌఖ్యం.

మిథునం –ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వల్పదన లాభం.

కర్కాటకం –స్థిరాస్థి వివాదాలు తీరుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు.

సింహం –ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్రా లాభాలుపొందుతారు.

కన్య –బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు.

తుల –మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం.

వృశ్చికం –వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు కొంత వరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత వరకు తీరుతాయి. సోదరుల నుండి ధన లాభం.

ధనుస్సు –ప్రముఖుల కలయిక. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం –రుణాల నుండి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందును.

కుంభం –పనులలో ఆటంకాలు ఎదురైన చికాకులు కొంత వరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం –అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News