Sunday, September 14, 2025

టోల్‌గేటు తెరవలేదని ఉద్యోగిని కొట్టి చంపారు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో టోల్‌ప్లాజా గేట్లు తెరవడంలో ఆలస్యం చేశాడని అక్కడ పనిచేసే ఉద్యోగిని ఓ గుంపు కొట్టి చంపింది.ఈ దారుణం ఆదివారం రాత్రి జరిగింది. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగర జిల్లాలోని బిదడి టౌన్‌లో టోల్‌ప్లాజా వద్ద 26 ఏండ్ల పవన్‌కుమార్, మంజునాథలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిరువురు చాలా సేపటివరకూ టోల్‌ప్లాజా గేట్లు తెరవలేదని ఆగ్రహించి అక్కడి వాహనదారులు ఒక్కసారి వీరిపై విరుచుకుపడి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిలో ఆ తరువాత పవన్‌కుమార్ మృతి చెందాడు, మంజునాథ చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టోల్ గేటు మూసేసి అర్థరాత్రి తరువాత వీరిద్దరూ భోజనాలకు బయటకు రాగా అక్కడున్న వారు వీరిని వెంబడించి దాడికి దిగినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News