Tuesday, April 30, 2024

ఉగాది ముందు రోజే సంపూర్ణ సూర్యగ్రహణం

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 8న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం

54 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం

ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతుండగా వాటిలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఇప్పటికే మొట్టమొదటిగా చంద్రగ్రహణం గత నెలలో ఏర్పడింది.

1970లో చివరిసారిగా సంపూర్ణ గ్రహణం

వాషింగ్టన్:  ఈ ఏడాదిలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం.   54  ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి.  1970 లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్‌లో కనిపించబోదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. అయితే, ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని కోట్లాది మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి. ఈ గ్రహణం మజాట్లాన్, మెక్సికో నుంచి న్యూఫౌండ్‌ ల్యాండ్ వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీనిని చూసే అవకాశం లభించనుంది.

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News