Sunday, April 27, 2025

ఎసిబి వలలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

భవన నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఎసిబి అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎల్‌బి నగర్ చింతకుంటకు చెందిన జితేందర్ రెడ్డి బిల్డింగ్ కట్టుకునేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేశాడు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జగన్‌మోహన్ అనుమతి కోసం రూ.50,000లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జగన్‌మోహన్‌కు రూ.50,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News